Nakka Anand Babu: ఇదే బొత్స అప్పట్లో జగన్, షర్మిలపై ఎన్ని వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలుసు: నక్కా ఆనంద్ బాబు

  • బొత్సతో మాట్లాడిస్తోంది సీఎం జగనే అంటున్న నక్కా
  • బొత్స ఎప్పుడెలా మాట్లాడతాడో ఎవరికీ తెలియదంటూ విమర్శలు
  • బొత్స మాటలను అర్థం చేసుకోవడం విలేకరులకు కూడా కష్టమేనని వ్యాఖ్యలు

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణపై టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. బొత్స ఎప్పుడెలా మాట్లాడతాడో ఎవరికీ తెలియదని, ఆయన మాట్లాడే విషయాలు మీడియా ప్రతినిధులు కూడా అర్థం చేసుకోలేరని విమర్శించారు. బొత్స వ్యాఖ్యల వెనుక సీఎం జగన్ ఉన్నాడని, ఆయనే బొత్సతో పూటకో మాట మాట్లాడిస్తున్నాడని మండిపడ్డారు. ఇదే బొత్స గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జగన్, షర్మిలపై ఎన్ని వ్యాఖ్యలు చేశాడో అందరికీ తెలుసని అన్నారు.

Nakka Anand Babu
Andhra Pradesh
Telugudesam
YSRCP
Jagan
Botsa Satyanarayana
  • Loading...

More Telugu News