MS Dhoni: ధోనీ రిటైర్మెంట్ వార్తలను ఖండించిన బీసీసీఐ

  • ధోనీ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడంటూ ప్రచారం
  • తప్పుడు ప్రచారమేనన్న బీసీసీఐ
  • రిటైర్మెంట్ పై తమకు ఎలాంటి సమాచారం లేదన్న ఎమ్మెస్కే ప్రసాద్

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ రిటైర్ కాబోతున్నాడని... కాసేపట్లో రిటైర్మెంట్ పై ప్రకటన చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ వార్తలను బీసీసీఐ ఖండించింది. ఈ వార్తలు తమను ఆశ్చర్యానికి గురి చేశాయని తెలిపింది. ధోనీ రిటైర్మెంట్ పై తమకు ఎలాంటి సమాచారం లేదని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు.

ఇదంతా తప్పుడు ప్రచారమేనని కొట్టిపడేశారు. దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్ట్ సిరీస్ కు జట్టును ప్రకటించిన సందర్భంగా ఎమ్మెస్కే మాట్లాడుతూ, ఈ మేరకు స్పందించారు.

MS Dhoni
BCCI
Retirement
  • Loading...

More Telugu News