Nannapaneni: ఆ ఎస్సై కులమేమిటో కూడా నాకు తెలియదు: నన్నపనేని

  • కులం పేరుతో దూషించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • దళితులకు న్యాయం చేయడమే మాకు తెలుసు
  • దళితులను దూషించడం మాకు రాదు

ఛలో ఆత్మకూరు కార్యక్రమం సందర్భంగా టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి ఓ దళిత మహిళా ఎస్సైను కులం పేరుతో దూషించారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో నన్నపనేనిపై కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో నన్నపనేని మాట్లాడుతూ, ఆ ఎస్సైది ఏ కులమో కూడా తనకు తెలియదని చెప్పారు. ఎస్సైను తాను దుర్భాషలాడినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దళితులకు న్యాయం చేయడమే తమకు తెలుసని.. వారిని దూషించడం తమకు రాదని చెప్పారు.

టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ, దళిత ఎస్సైని అడ్డు పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం నాటకాలాడుతోందని విమర్శించారు. దళితుల పేరుతో రాజకీయాలు చేయాలనుకోవడం దారుణమని అన్నారు.

Nannapaneni
Telugudesam
  • Loading...

More Telugu News