South Africa: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు భారత జట్టు ప్రకటన

  • అక్టోబరు 2 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్
  • భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
  • ఈ జట్టులో కేఎల్ రాహుల్ కు దక్కని చోటు

అక్టోబరు 2 నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న మూడు టెస్టుల సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో కేఎల్ రాహుల్ కు స్థానం దక్కలేదు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో కేఎల్ రాహుల్ పేలవ ప్రదర్శన కారణంగా అతన్ని పక్కనపెట్టినట్టు సమాచారం. రాహుల్ స్థానంలో శుబ్ మన్ గిల్ ను తీసుకున్నారు.

భారత జట్టు .. విరాట్ కోహ్లీ (కెప్టెన్),  అజింక్యా రహానే(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), పుజారా, హనుమ విహారి, మయాంక్ అగర్వాల్, అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్ దీప్ యాదవ్, షమి, బుమ్రా, ఇషాంత్ శర్మ,శుభ్ మన్ గిల్

South Africa
India
Test series
virak kohli
Rohit
  • Loading...

More Telugu News