BJP: నిజామాబాద్ బీజేపీ ఎంపీని కలిసిన బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్

  • షకీల్ ఈరోజు నా నివాసానికి వచ్చారు
  • తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించాం
  • పలు విషయాలపై లోతుగా చర్చించాం: అరవింద్

నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ను టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కలిశారు. ఈ విషయాన్ని అరవింద్ తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నారు. తన నివాసంలో ఈరోజు తనను షకీల్ కలిశారని తెలిపారు. రాష్ట్రంలోని, జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులు, పలు విషయాలపై లోతైన చర్చ జరిగిందని అన్నారు.

ఈ సందర్భంగా అరవింద్ కు షకీల్ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ ఫొటోను అరవింద్ పోస్ట్ చేశారు. కాగా, బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్. కొంత కాలంగా పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. అరవింద్ ను షకీల్ కలవడంపై ఆయన బీజేపీలోకి వెళ్తున్నారంటూ ప్రచారం ప్రారంభమైంది. టీఆర్ఎస్ నేతలకు షకీల్ ఫోన్ లో కూడా అందుబాటులో లేరని సమాచారం.

BJP
TRS
Mla
shakil
mp
Aravind
  • Loading...

More Telugu News