Palnadu: దళిత మహిళా ఎస్సై ఫిర్యాదు చేస్తే టీడీపీ నేతలపై చర్యలు తీసుకుంటాం: హోంమంత్రి

  • పల్నాడు ప్రాంతంలో ఏదో జరుగుతోందని ప్రచారం చేస్తున్నారు
  • ప్రశాంతంగా ఉన్న పల్నాడులో టీడీపీ ఉద్రిక్తతలను రేపుతోంది
  • పోలీసు శాఖలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తాం

పల్నాడు ప్రాంతంలో ఏదో జరుగుతోందంటూ అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఏపీ హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో టీడీపీ అలజడి సృష్టిస్తోందని మండిపడ్డారు. ఇలాంటి ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. దళితులను కించపరుస్తూ మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ కార్యకర్తలపై కూడా కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. టీడీపీ నేతలు దళిత మహిళా ఎస్సైను కులం పేరుతో దూషించడం తప్పని అన్నారు. సదరు మహిళా ఎస్సై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. త్వరలోనే భారీ రిక్రూట్ మెంట్ జరుగుతుందని... పోలీసు శాఖలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తామని వెల్లడించారు.

Palnadu
Telugudesam
YSRCP
Sucharitha
  • Loading...

More Telugu News