Jagan: సీఎం గారూ, మీ వెనుక ఏం జరుగుతోందో తెలుసుకోండి: వర్ల రామయ్య

  • పొనుగుపాడులో రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మాణం
  • వైసీపీ కార్యకర్తలే ఆ గోడ కట్టారంటూ టీడీపీ ఆరోపణ
  • ట్విట్టర్ లో స్పందించిన వర్ల రామయ్య

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుపాడులో టీడీపీ మద్దతుదారుల ఇళ్లకు దారిలేకుండా రోడ్డుకు అడ్డంగా గోడ కట్టారంటూ వైసీపీ కార్యకర్తలపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. సీఎం గారూ ఓసారి మీ వెనుక ఏం జరుగుతోందో తెలుసుకోండి అంటూ హితవు పలికారు.

'మీ సలహాదారులు ఇస్తున్న సలహాలు సరైనవేనా?' అనే విషయం సమీక్షించుకోవాలని సూచించారు. పొనుగుపాడులో రోడ్డుకు అడ్డంగా నిర్మించిన గోడను ఇంతవరకు తొలగించలేదని, మీ నిర్వాకం కారణంగా గ్రామస్తులు రహదారి హక్కు కోల్పోయారని మండిపడ్డారు. గోడను తొలగించడం ద్వారా పొనుగుపాడు గ్రామస్తుల హక్కును పునరుద్ధరించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

Jagan
YSRCP
Varla Ramaiah
Ponugupadu
Guntur District
  • Error fetching data: Network response was not ok

More Telugu News