Buggana: సింగపూర్ లో ఏపీ పరువు తీస్తున్నారు: యనమల

  • ఏపీ ప్రతిష్ట దెబ్బతినేలా బుగ్గన వ్యాఖ్యానిస్తున్నారు
  • అమరావతి నిర్మాణానికి నిధులు లేవని చెబుతున్నారు
  • రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలను జగన్ దెబ్బతీశారు

సింగపూర్ వెళ్లిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడుతున్నారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు లేవని చెబుతూ, తన విధానం ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేసిందని అన్నారు. తన పాలనను ప్రజలు మెచ్చుకుంటారని ముఖ్యమంత్రి జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. 6 నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటానని చెప్పిన జగన్... 100 రోజుల్లోనే తన కంటే చెడ్డ సీఎం లేరని నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలను జగన్ దెబ్బతీశారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని అన్నారు.

Buggana
Yanamala
Jagan
Singapore
YSRCP
Telugudesam
Amaravathi
  • Loading...

More Telugu News