Nithin: 'భీష్మ'కి హైలైట్ గా నిలవనున్న కామెడీ

  • నితిన్ కథానాయకుడిగా 'భీష్మ'
  • కీలకమైన పాత్రలో హెబ్బా పటేల్ 
  • క్రిస్మస్ కి భారీస్థాయి విడుదల

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ కథానాయకుడిగా 'భీష్మ' రూపొందుతోంది. రష్మిక మందన కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, హెబ్బా పటేల్ కీలకమైన పాత్రలో కనిపించనుంది. నెగెటివ్ షేడ్స్ తో కూడినదిగా ఆమె పాత్ర కనిపించనుందని అంటున్నారు. ఈ సినిమాలో కావలసినంత కామెడీ ఉంటుందట.

 వెన్నెల కిషోర్ .. నితిన్ మధ్య నడిచే ఈ కామెడీ కడుపుబ్బా నవ్విస్తుందని అంటున్నారు. ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా కామెడీ ట్రాక్ నిలుస్తుందని చెబుతున్నారు. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాను 'క్రిస్మస్' కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో నితిన్ వున్నాడు. ఇక ఈ సినిమా తన కెరియర్ ను మళ్లీ గాడిలో పెడుతుందనే ఆశతో హెబ్బా పటేల్ వుంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News