Tamilnadu: జయలలిత సమాధే వేదిక... వైభవంగా అన్నాడీఎంకే నేత కుమారుడి వివాహం!

  • కుమారుడి పెళ్లిని నిశ్చయించిన భవానీ శంకర్
  • అమ్మపై అభిమానంతో సమాధి ముందే పెళ్లి
  • ఆశీర్వదించేందుకు తరలి వచ్చిన ప్రముఖులు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితంటే, తమిళులకు ఎంత అభిమానమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అదే అభిమానంతో, ఆమె సమాధినే, తన కుమారుడి పెళ్లి వేదికగా మార్చుకున్నారు ఓ అన్నాడీఎంకే నేత. అమ్మపై తనకున్న భక్తిని వినూత్నంగా చాటుకున్న పార్టీ నేత ఎస్ భవానీ శంకర్, తన కుమారుడు సాంబశివరామన్ వివాహాన్ని దీపిక అనే యువతితో నిశ్చయించి, పెళ్లిని చెన్నై బీచ్ లోని అమ్మ స్మారక స్థూపం వద్ద సంప్రదాయబద్ధంగా జరిపించారు.

 తానెంతో అభిమానించే జయలలిత దూరమై మూడేళ్లు గడుస్తున్నా ఆమెను మరచిపోలేదని, అమ్మ ఆశీర్వాదం తన కొడుకు, కోడలికి ఉండాలన్న ఉద్దేశంతోనే పెళ్లిని ఇక్కడ జరిపిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా జయలలిత సమాధిని పూలతో అందంగా అలంకరించారు. వధూవరులను ఆశీర్వదించేందుకు అన్నా డీఎంకే నేతలు, పలువురు ప్రముఖులు తరలి రావడంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది.

Tamilnadu
Jayalalitha
AIADMK
Marriage
  • Loading...

More Telugu News