Sai Dharam Tej: 'ప్రతిరోజూ పండగే' నుంచి ఆకట్టుకుంటోన్న ఫస్టులుక్ పోస్టర్

  • మారుతి నుంచి 'ప్రతిరోజూ పండగే'
  • తేజూ జోడీగా రాశి ఖన్నా 
  • కీలకమైన పాత్రలో సత్యరాజ్

'చిత్రలహరి' సినిమాతో దక్కిన సక్సెస్ ను సాయిధరమ్ తేజ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. అందువలన మంచి కథ కోసం కొంత గ్యాప్ తీసుకుని, దర్శకుడు మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బంధాలు .. అనుబంధాల నిలయమే కుటుంబం అనే కాన్సెప్ట్ తో మారుతి తయారు చేసుకున్న కథ, 'ప్రతిరోజూ పండగే' టైటిల్ తో రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా సగానికిపైగా చిత్రీకరణ జరుపుకుంది.

సాయిధరమ్ తేజ్ జోడీగా రాశి ఖన్నా నటిస్తోన్న ఈ సినిమాలో, తేజుకి తాతయ్య పాత్రలో సత్యరాజ్ కనిపించనున్నారు. ఈ సినిమాకి ఆయన పాత్ర కీలకం కానుంది. తాజాగా తాతా మనవళ్లుగా తేజు - సత్యరాజ్ పాత్రలకి సంబంధించిన పోస్టర్ ను ఫస్టులుక్ గా వదిలారు. గ్రామీణ నేపథ్యంలో తాతా మనవళ్ల మధ్య అనురాగానికి అద్దం పడుతోన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. మొత్తానికి మారుతి ఫస్టులుక్ తోనే మంచి మార్కులు కొట్టేశాడు.

Sai Dharam Tej
Rasi Khanna
Sathya Raj
  • Loading...

More Telugu News