Mohan Bhagwat: బైక్ ను ఢీకొన్న ఆరెస్సెస్ అధ్యక్షుడి కాన్వాయ్ వాహనం... చిన్నారి మృతి

  • రాజస్థాన్ లో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న మోహన్ భగవత్
  • కాన్వాయ్ లో ఎనిమిది నుంచి పది వాహనాలు
  • డ్రైవర్ పై ఎఫ్ఐఆర్ నమోదు

ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్  కాన్వాయ్ లోని ఓ వాహనం బైక్ ను ఢీకొన్న ఘటనలో ఆరేళ్ల వయసున్న సచిన్ అనే బాలుడు మృతి చెందాడు. అతని తాత గాయపడ్డారు. రాజస్థాన్ లోని తిజారా నగరంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నిన్న జరిగింది.

ప్రమాదం జరిగిన సమయంలో మోహన్ భగవత్ కాన్వాయ్ లో ఎనిమిది నుంచి పది వాహనాలు ఉన్నాయి. ఈ సందర్భంగా స్థానిక సబ్ ఇన్స్ పెక్టర్ రామ్ స్వరూప్ మాట్లాడుతూ, ప్రమాదం తర్వాత బెహ్రార్ దిశగా కాన్వాయ్ వెళ్లిపోయిందని తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని ఇంకా సీజ్ చేయాల్సి ఉందని చెప్పారు. ప్రమాదానికి కారణమైన వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా డ్రైవర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. మోహన్ భగవత్ కు కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పిస్తోంది.

Mohan Bhagwat
RSS
Convoy
Road Accident
  • Loading...

More Telugu News