ఏపీ సీఎం జగన్ బంధువుతో మెదక్ ఎస్పీ దీప్తి వివాహం?
- వరంగల్ కు చెందిన చందన దీప్తి
- ఢిల్లీ ఐఐటీ నుంచి పట్టా పొంది ఐపీఎస్ కు ఎంపిక
- కేసీఆర్ కు శుభలేఖ అందించిన ఐపీఎస్ అధికారిణి
వరంగల్ లో పుట్టిన దీప్తి చదువంతా హైదరాబాద్ లో సాగింది. ఐఐటీ ఢిల్లీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్న ఆమె, 2012లో సివిల్స్ రాసి ఐపీఎస్ గా ఎంపికయ్యారు. తెలంగాణలో జిల్లాల పునర్విభజన అనంతరం మెదక్ ఎస్పీగా పనిచేస్తున్నారు. చందనా దీప్తికి భరతనాట్యంలో మంచి ప్రవేశం ఉంది. కాగా, దీప్తి వివాహం నేపథ్యంలో ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి కలుసుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.