buggana rajendranath reddy: అమరావతి నిర్మాణంపై ఏపీ మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు

  • రాజధాని నిర్మాణానికి నిధులు లేవు
  • అభివృద్ధిని వికేంద్రీకరిస్తాం
  • అమరావతిని విస్మరించలేదు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సరిపడా నిధులు లేవని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని ఒక్క ప్రాంతానికే పరిమితం చేయాలనుకోవడం లేదన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడంపైనే దృష్టి సారించినట్టు తెలిపారు. భారత్-సింగపూర్ వ్యాపార, ఆవిష్కరణల సదస్సుకు ఏపీ తరపున హాజరైన ఆయన అక్కడ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

అమరావతిని తాము విస్మరించలేదన్న మంత్రి, దీని నిర్ణయానికి మరికొన్ని నెలల సమయం పడుతుందన్నారు. అభివృద్ధిని వికేంద్రీకరించడంపై దృష్టి సారించామన్నారు. అందరికీ సుస్థిర జీవనం, ఉత్పాదక రంగాన్ని అన్నిచోట్లా అభివృద్ధి చేయడం, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి వాటి కల్పనే ప్రభుత్వ ధ్యేయమన్నారు.

సింగపూర్ విదేశాంగమంత్రి వివియన్ బాలకృష్ణన్ సదస్సులో మాట్లాడుతూ.. ఏపీలో కొత్త ప్రభుత్వం వంద రోజుల పాలనను మాత్రమే పూర్తి చేసుకుందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు తమ ప్రాధామ్యాలను మార్చుకుంటున్నప్పుడు కాంట్రాక్టర్లు కూడా ఆయా ప్రాజెక్టుల్లో కొనసాగాలా? వద్దా? అనేది నిర్ణయించుకుంటారని పేర్కొన్నారు. రాజధానిపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని సదస్సుకు హాజరైన భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు.

buggana rajendranath reddy
amaravathi
Andhra Pradesh
  • Loading...

More Telugu News