Chalo Aatmakur: ఈ పోరాటం చరిత్రలో ఉండిపోతుంది: చంద్రబాబునాయుడు

  • ‘ఛలో ఆత్మకూరు’కు స్పందించిన అందరికీ ధన్యవాదాలు
  • నోటీసులు ఇవ్వకుండా ఇళ్ళల్లో నిర్బంధించారు
  • ఇది వైసీపీ నిరంకుశ పాలనకు పరాకాష్ఠ 

‘ఛలో ఆత్మకూరు’ పిలుపునకు స్పందించి.. వైసీపీ ప్రభుత్వ బాధితులకు సంఘీభావంగా నిలబడ్డ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ఈ పోరాటం చరిత్రలో ఉండిపోతుందని అన్నారు.

టీడీపీ నేతలకు నోటీసులు ఇవ్వకుండా ఇళ్ళలో నిర్బంధించి, మహిళలను, బీసీ, ఎస్సీ నేతలను అనేక పోలీస్ స్టేషన్లకు తిప్పడం వైసీపీ నిరంకుశ పాలనకు పరాకాష్ఠగా ఆయన అభివర్ణించారు. గుంటూరు పునరావాస శిబిరాన్ని భగ్నం చేసి, బాధితులను గ్రామాలకు తరలించారని విమర్శించారు. వారి ప్రాణాలకు, ఆస్తులకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనని అన్నారు. మళ్ళీ బుధవారం ఆత్మకూరును సందర్శిస్తామని, అప్పటికల్లా బాధితులకు జరిగిన అన్యాయాలను చక్కదిద్దాలని, దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Chalo Aatmakur
Telugudesam
Chandrababu
YSRCP
  • Error fetching data: Network response was not ok

More Telugu News