Eluru: ఏలూరు సబ్ జైలుకు చింతమనేని తరలింపు!
- ఎస్సీ, ఎస్టీ కేసులో చింతమనేని అరెస్టు
- ఏలూరు కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
- 14 రోజుల రిమాండ్ విధింపు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ రోజు అరెస్టయిన విషయం తెలిసిందే. చింతమనేనిని ఏలూరు కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు చింతమనేనిని ఏలూరు సబ్ జైలుకు పోలీసులు తరలించారు. ఈ నెల 25 వరకూ ఆయన రిమాండ్ లో వుంటారు.