Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ విధానం ఇలాగే ఉంటే బీజేపీ చూస్తూ ఊరుకోదు: ఎంపీ సుజనా చౌదరి హెచ్చరిక

  • వరదల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైంది
  • ప్రభుత్వ వైఫల్యం వల్లే ముంపు సంభవించింది
  • జమిలి ఎన్నికలపై నాకు సమాచారం లేదు

ఏపీలో ఇటీవల సంభవించిన వరదల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముంపునకు గురయ్యేందుకు ఆస్కారం లేని గ్రామాలు కూడా ప్రభుత్వ వైఫల్యం కారణంగా జలదిగ్బంధానికి గురయ్యాయని విమర్శించారు. ప్రభుత్వ విధానం ఇలాగే ఉంటే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

రాజధాని అమరావతి విషయంలో కూడా ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జమిలి ఎన్నికలు రావొచ్చని నిన్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సుజనా స్పందించారు. ఈ అంశం మాజీ సీఎం స్థాయిలో ఉండదని, ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని అన్నారు. జమిలి ఎన్నికలపై తనకు సమాచారం లేదని పేర్కొన్నారు.

Andhra Pradesh
YSRCP
BJP
Sujana Chowdary
  • Loading...

More Telugu News