Telugudesam: ప్రజాస్వామ్యంలో ఈ రోజును చీకటి రోజుగా పరిగణించాలి: ఎంపీ రామ్మోహన్ నాయుడు

  • చంద్రబాబు హౌస్ అరెస్ట్ దుర్మార్గం
  • ప్రజలు భయపడిపోతున్నారు
  • జగన్ సీఎం అయిన మరుక్షణమే టీడీపీ శ్రేణులపై దాడులు మొదలయ్యాయి

తమ అధినేత చంద్రబాబును హౌస్ అరెస్టు చేయడం, పలువురు నేతలను అదుపులోకి తీసుకోవడం దుర్మార్గం అని, ప్రజాస్వామ్యంలో ఈరోజును చీకటిరోజుగా పరిగణించాలని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఫ్యాక్షనిస్టుల పాలనలో ఉన్నట్టు ప్రజలు భయపడుతున్నారని విమర్శించారు.

జగన్ సీఎం అయిన మరుక్షణం టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేయడం ప్రారంభించారని మండిపడ్డారు. ఆత్మకూరు పునరావాస కేంద్రంలో అరవై కుటుంబాలు ఉన్నాయని, బాధితులకు ఆహారం తీసుకు వెళ్తుంటే తమ వారిని అడ్డుకుని క్రూరత్వం ప్రదర్శించారని వైసీపీ పై మండిపడ్డారు. ఈ ఘటనపై సీఎం జగన్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.

Telugudesam
Chandrababu
mp
Ram mohan naidu
  • Loading...

More Telugu News