Telugudesam: కోడెల బాధితులంతా టీడీపీలోని వారే: వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి

  • ‘దమ్ముంటే నరసరావుపేట రండి, వాస్తవాలు చర్చిద్దాం’
  • కోడెల కుటుంబం ఎన్నో ఘోరాలు చేసింది
  • నరసరావుపేట, సత్తెనపల్లిలో ‘కే-ట్యాక్స్’ వసూలు చేశారు

టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు బాధితులంతా ఆ పార్టీకి చెందిన వారేనని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘దమ్ముంటే నరసరావుపేట రండి, వాస్తవాలు చర్చిద్దాం’ అని టీడీపీ నేతలకు ఆయన సవాల్ విసిరారు. టీడీపీ హయాంలో కోడెల కుటుంబం ఎన్నో ఘోరాలు చేసిందని ఆరోపించారు. నరసరావుపేట, సత్తెనపల్లిలో కే-ట్యాక్స్ పేరుతో డబ్బులు వసూలు చేశారని, కోడెల కుటుంబం ఎన్నో కుంభకోణాలు చేసిందని, అసెంబ్లీ ఫర్నిచర్ కూడా దోచుకున్న వ్యక్తి కోడెల అని ఎద్దేవా చేశారు. కోడెల కుటుంబాన్ని శిక్షించాలని డిమాండ్ చేశారు.

Telugudesam
kodela siva prasa
YSRCP
Gopi reddy
  • Loading...

More Telugu News