Tamilnadu: పాఠశాల ప్రాంగణంలోనే రొమాన్స్.. టీచర్ ను చితకబాదిన గ్రామస్తులు!

  • తమిళనాడులో నామక్కల్ జిల్లాలో ఘటన
  • అంగన్వాడీ ఉద్యోగితో టీచర్ వివాహేతర సంబంధం
  • స్కూలు ప్రాంగణంలోనే కామక్రీడ

పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్ దారితప్పాడు. పాఠశాలలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ సందర్భంగా వీరిద్దరూ పాఠశాలలోనే రాసలీలలు కొనసాగిస్తుండగా, గ్రామస్తులు సదరు టీచర్ ను పట్టుకుని చితకబాదారు. ఈ ఘటన తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని బుధన్‌సంత సమీపంలో వున్న ఉడుపత్తి పంచాయతీ ప్రాథమిక పాఠశాలలో శరవణన్ టీచర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు అదే పాఠశాల ప్రాంగణంలో అంగన్ వాడీ కేంద్రం ఆర్గనైజర్ గా పనిచేస్తున్న జయంతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీరిద్దరు పాఠశాల ప్రాంగణంలోనే కామక్రీడలో మునిగిపోయారు.

ఈ నిర్వాకాన్ని చూసిన పిల్లలు తమ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో కోపంతో ఊగిపోయిన గ్రామస్తులు టీచర్ శరవణన్ ను పట్టుకుని చితక్కొట్టారు. అనంతరం స్కూలు హెడ్ మాస్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో త్వరలోనే విచారణ ప్రారంభం కానున్నట్లు సమాచారం.

Tamilnadu
School
Romance
Teacher
Beaten
Villegers
  • Loading...

More Telugu News