Andhra Pradesh: మరికాసేపట్లో.. పలు కీలక అంశాలపై సమీక్ష చేపట్టనున్న ఏపీ సీఎం జగన్!

  • ఉదయం 10.30 గంటలకు సమీక్ష ప్రారంభం
  • తొలుత నూతన ఇసుక విధానంపై అధికారులతో చర్చ
  • మధ్యాహ్నం 12 గంటలకు స్పందనపై వీడియో కాన్ఫరెన్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పలు అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. ఏపీ సచివాలయంలో ఈరోజు ఉదయం 10.30 గంటలకు తొలుత నూతన ఇసుక విధానంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమీక్షించనున్నారు.

అలాగే గ్రామ, వార్డు సచివాలయాలపై సమీక్ష చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ‘స్పందన’ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు జిల్లాలవారీగా స్పందన కార్యక్రమాన్ని ఏపీ సర్కారు ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Andhra Pradesh
Jagan
Chief Minister
Review meeting
  • Loading...

More Telugu News