Devineni Avinash: రోడ్డుపై ఆందోళన... దేవినేని అవినాశ్ అరెస్ట్!

  • 'ఛలో ఆత్మకూరు'కు బయలుదేరిన అవినాశ్
  • తాడేపల్లి మండలంలో అడ్డుకున్న పోలీసులు
  • రోడ్డుపై బైఠాయించి నిరసన

ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి బయలుదేరిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం విజయవాడ నుంచి బయలుదేరిన ఆయనను, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, అవినాశ్ వర్గీయులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరును నిరసించిన అవినాశ్, రోడ్డుపైనే నిరసనకు దిగారు. తాము శాంతియుతంగా నిరసన తెలియజేయాలని భావిస్తుంటే, పోలీసులు దాష్టీకానికి దిగుతున్నారని విమర్శించారు. అవినాశ్ బైఠాయింపుతో భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోగా, పోలీసులు ఆయన్ను బలవంతంగా అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్‌ కు తరలించారు.

Devineni Avinash
Arrest
Police
  • Loading...

More Telugu News