Jagan: సీఎం జగన్ కు లేఖ రాసిన 'సీపీఐ' రామకృష్ణ

  • పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తక్షణమే చేపట్టాలని డిమాండ్
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలంటూ స్పష్టీకరణ
  • గోదావరి వరదలపై స్పందించిన వామపక్ష నేత

పోలవరం ప్రాజెక్టు అంశంలో ఏపీ సీఎం జగన్ కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పూర్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. కాఫర్ డ్యామ్ కారణంగా ముంపు మండలాల రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు. గేట్ల నిర్మాణం పూర్తికాని దశలో రెండుసార్లు గోదావరికి వరదలు వచ్చాయని, వరదల కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పత్తి, మిర్చి, వరి పంటలు నీట మునిగాయని వివరించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇచ్చి పునరావాసం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Jagan
CPI
Ramakrishna
Polavaram
  • Loading...

More Telugu News