Akhil: నాగ్ నిర్మాతగా అఖిల్ తో పరశురామ్ సినిమా

  • సినిమాల మధ్య పెరుగుతోన్న గ్యాప్ 
  • 'బొమ్మరిల్లు' భాస్కర్ తో ఓ సినిమా 
  • నాగ్ ను మెప్పించిన పరశురామ్

సినిమాకి .. సినిమాకి మధ్య అఖిల్ నుంచి ఎక్కువ గ్యాప్ వచ్చేస్తోంది. సరైన ప్రాజెక్టులు సెట్ కాకపోవడం వలన ఆయన సినిమాల మధ్య గ్యాప్ పెరిగిపోతోంది. ఇకపై అలా జరగకూడదనే ఉద్దేశంతో నాగార్జున ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. అలా ఆయన గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఒక సినిమాను సెట్ చేశాడు. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

ఆ తరువాత సినిమాను పరశురామ్ దర్శకత్వంలో సెట్ చేశాడనేది తాజా సమాచారం. అన్నపూర్ణ బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతుందని అంటున్నారు. 'గీత గోవిందం' హిట్ తరువాత దర్శకుడు పరశురామ్ అనుకున్న ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. దాంతో ఆయన అఖిల్ కోసం నాగ్ కి ఒక కథ వినిపించడం .. ఆయనకి ఆ కథ నచ్చేయడం జరిగిపోయిందనే వార్త కొన్ని రోజుల క్రితం ఫిల్మ్ నగర్లో వినిపించింది. ఆ ప్రాజెక్టు ఖరారైపోయిందనేది తాజా సమాచారం. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Akhil
parashuram
  • Loading...

More Telugu News