KCR: కేసీఆర్ ను తప్పు పట్టాల్సిన అవసరం లేదు: మంత్రి పువ్వాడ అజయ్

  • ఒకేసారి అందరికీ పదవులు ఇవ్వడం సాధ్యం కాదు
  • అన్ని సామాజికవర్గాలకు మంత్రివర్గ విస్తరణలో న్యాయం చేశారు
  • తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తా

తెలంగాణ ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. పదవులు కొన్ని సందర్భాల్లో కొంత మందికి వస్తుంటాయని... ఒకేసారి అందరికీ పదవులు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణను ముఖ్యమంత్రి చేపట్టారని తెలిపారు. అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.

KCR
Puvvada Ajay
TRS
  • Loading...

More Telugu News