Chandrababu: అన్నింటికీ ప్రభుత్వానిదే బాధ్యత... వదిలిపెట్టేది లేదు: చంద్రబాబు

  • టీడీపీ కార్యకర్తలపై కేసులు ఎత్తివేయాలి
  • ధ్వంసమైన ఆస్తులకు నష్టపరిహారం చెల్లించాలి
  • బాధితులకు న్యాయమే తన సంకల్పమన్న బాబు

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పెట్టిన కేసున్నింటినీ తక్షణమే ఎత్తివేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ధ్వంసం చేసిన ఆస్తులకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనన్నారు. పల్నాడులో జరుగుతున్న అన్ని దుర్మార్గాలకూ ప్రభుత్వానిదే బాధ్యతని, బాధితులకు న్యాయం జరిగేంతవరకూ తాను వదిలిపెట్టబోనని హెచ్చరించారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు పెడుతూ, "అధికారులు ఓ వైపు గుంటూరు శిబిరంలో చర్చలు చేస్తూ మరోవైపు గురజాల డివిజన్ లో 144 సెక్షన్ విధించారు. ఇది రాజకీయ శాంతిభద్రతల సమస్య. పండుగల శాంతిభద్రతల అంశం కాదు.  ఇది రాష్ట్ర సమస్య కానీ, కేవలం పల్నాడు ప్రాంత సమస్య కాదు. బాధితులకు న్యాయం చేయాలన్నదే టీడీపీ దృఢ సంకల్పం" అన్నారు.

అంతకుముందు, "తప్పుడు కేసులు అన్నింటినీ ఎత్తేయాలి. ధ్వంసమైన ఆస్తులకు నష్ట పరిహారం చెల్లించాలి. 110 రోజులుగా గ్రామాల నుంచి వెళ్లగొట్టారు. వందలాది కుటుంబాల జీవనోపాధి పోగొట్టారు. వీటన్నింటికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. న్యాయం జరిగేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు" అని ట్వీట్ చేశారు.

Chandrababu
Jagan
Andhra Pradesh
Palnadu
  • Error fetching data: Network response was not ok

More Telugu News