Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ బయల్దేరిన బండారు దత్తాత్రేయ.. రేపే ప్రమాణస్వీకారం

  • హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా దత్తాత్రేయ నియామకం
  • రేపు ఉదయం 10.30 గంటలకు ప్రమాణస్వీకారం
  • హిమాచల్ ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తానన్న దత్తాత్రేయ

బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ కు బయల్దేరి వెళ్లారు. హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్ గా దత్తాత్రేయ నియమితులైన సంగతి తెలిసిందే. హైదరాబాదులోని ఆయన నివాసంలో దత్తాత్రేయకు అధికారులు నియామక పత్రాలను అందజేశారు. రేపు ఉదయం 10.30 గంటలకు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేయనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ, హిమాచల్ ప్రదేశ్ ప్రజల అభ్యున్నతి కోసం తాను కృషి చేస్తానని చెప్పారు. మరోవైపు, గవర్నర్ గా నియమితులైన సందర్భంగా దత్తన్నను పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ ప్రముఖులు కలసి శుభాకాంక్షలు తెలిపారు.

Himachal Pradesh
Governor
Bandaru Dattatreya
  • Loading...

More Telugu News