Vijayasai Reddy: విజయసాయిరెడ్డి, బుద్ధా వెంకన్నల మధ్య మరోసారి పేలిన మాటల తూటాలు

  • పచ్చ దొంగలకు అమరావతి తప్ప ఏం పట్టదన్న విజయసాయి
  • అవినీతిని నిరూపించకుండా ఏం గడ్డి పీకుతున్నారన్న వెంకన్న
  • అడ్డమైన ఆరోపణలు చేయడం ఆపాలని హితవు

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నల మధ్య మాటల తూటాలు పేలాయి. 'పచ్చ దొంగలకు అమరావతి తప్ప ఇంకేమీ పట్టదు. లక్షల కోట్ల రియలెస్టేట్ రాబడుల గురించే వారి ధ్యాస అంతా. అందుకే ఏదో ఒక కృత్రిమ సమస్యను సృష్టించి, అనుకూల మీడియాతో అలజడి రేపాలని చూస్తున్నారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి మీరు చేసింది అదే కాదా' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ పై బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు. 'సిగ్గులేని సాయిరెడ్డి... అమరావతిలో లక్షల కోట్ల అవినీతి జరిగిందా? మీరు అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయింది. అవినీతిని నిరూపించకుండా ఏం గడ్డి పీకుతున్నారు. నోరు ఉంది కదా అని అడ్డమైన ఆరోపణలు చేయడం ఆపండి. అధికారంలో ఉన్నది మీరే అనే విషయాన్ని మర్చిపోకండి. నీ దొంగ పేపర్ లో రాసే వార్తలు అక్షరసత్యాలా? ప్రపంచ బ్యాంక్ వెనక్కి వెళ్లిపోవడానికి మీ కుట్రే కారణమని పత్రికలు బయటపెడితే... అవి పచ్చ పత్రికలు అని మీడియాను అవమానపరుస్తారా? రాజధానిపై ట్విట్టర్ లో కాదు... దమ్ముంటే అక్కడకు వచ్చి రైతుల ముందు మీ పార్టీ స్టాండ్ ఏంటో చెప్పి వెళ్లండి 420 తాతయ్యా' అని మండిపడ్డారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News