Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులకు సహకరిస్తున్న ఎనిమిది మంది అరెస్ట్

  • ఉగ్రవాదులతో సన్నిహితంగా వ్యవహరిస్తున్న నిందితులు
  • పలు దాడులకు వ్యూహరచన
  • స్థానికులపై దాడులు, హత్యల కేసుల్లో కూడా నిందితులుగా ఉన్న వైనం

లష్కరే తాయిబా ఉగ్రవాదులకు సహకరిస్తున్న ఎనిమిది మంది వ్యక్తులను జమ్ముకశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి వీరిని అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులతో వీరంతా సన్నిహితంగా వ్యవహరిస్తున్నారని... జమ్మూ కశ్మీర్ లో పలు దాడులకు వ్యూహరచన చేశారని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు.

ఉగ్రవాదులకు అనుకూలంగా ఉన్న పోస్టర్లను గోడలపై అతికిస్తున్నారని చెప్పారు. స్థానికులపై దాడి చేయడం, వారిని హతమార్చడం వంటి కేసుల్లో కూడా వీరు నిందితులుగా ఉన్నారని తెలిపారు. సాజిద్ మిర్ అనే ఉగ్రవాది ఆదేశానుసారం వీరంతా పని చేస్తున్నారని వెల్లడించారు. నిందితుల నుంచి పోస్టర్లను, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో ఒమర్ మిర్, ఇజాజ్ మిర్, తాసిఫ్ నాజర్, ఒమర్ అక్బర్, ఇంతియాజ్ నాజర్, షౌకత్ అహ్మద్ మిర్, డానిష్ హబీబ్ ఫైజన్ లతీఫ్ లు ఉన్నారు.

Jammu And Kashmir
Terrorist
Lashkar e Taiba
  • Loading...

More Telugu News