Andhra Pradesh: ‘పోలవరం’ విషయంలో జగన్ సర్కారుపై కేంద్రం సీరియస్

  • రెండు వారాల క్రితం పీఎంవో రాసిన లేఖపై స్పందించని ఏపీ సర్కారు
  • రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలన్న నిర్ణయం వెనకున్న కారణం చెప్పాలన్న కేంద్రం
  • రెండు వారాలైనా స్పందన లేకపోవడంతో సీరియస్

పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వంపై కేంద్రం మరోమారు సీరియస్ అయింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పరిణామాలపై నివేదిక ఇవ్వాలంటూ రెండు వారాల క్రితం జగన్ సర్కారుకు ప్రధానమంత్రి కార్యాలయం లేఖ రాసింది. రివర్స్ టెండరింగ్‌పై ప్రాజెక్ట్ అథారిటీ విముఖత ప్రదర్శించినా.. ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లడంతో కేంద్రం వివరణ కోరింది. రివర్స్ టెండరింగ్ ‌కు వెళ్లాలన్న నిర్ణయం వెనక ఉన్న కారణం చెప్పాలని కోరింది.

అయితే, ఈ లేఖపై ఏపీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేకపోవడంతో కేంద్ర జలశక్తి మండలి సీరియస్ అయింది. పీఎంవో రాసిన లేఖపై రెండు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు తాజాగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఓపీ సిన్హా లేఖ రాశారు.

Andhra Pradesh
polavaram
union government
  • Loading...

More Telugu News