Nara Lokesh: గౌరవ హోంమంత్రి సుచరిత గారు ఒకలా చెబుతున్నారు, డీజీపీ మరోలా చెబుతున్నారు... ఎవరి మాటలు నమ్మాలి?: నారా లోకేశ్

  • చర్చనీయాంశంగా మారిన పల్నాడు
  • 'ఛలో ఆత్మకూరు' తలపెట్టిన టీడీపీ
  • అక్కడి పరిస్థితులపై భిన్న వాదనలు వినిపిస్తున్నారంటూ లోకేశ్ ఆగ్రహం

పల్నాడులో తమ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారంటూ టీడీపీ గత కొన్నిరోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీడీపీ తలపెట్టిన 'ఛలో ఆత్మకూరు' కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. దీనిపై నారా లోకేశ్ స్పందించారు. గౌరవ హోంమంత్రి సుచరితగారు పల్నాడులో సాధారణ పరిస్థితులు ఉన్నాయని చెబుతుంటే, పోలీస్ బాస్ డీజీపీ మాత్రం పల్నాడులో సాధారణ పరిస్థితులు లేవని అంటున్నారని, పల్నాడులో 144 సెక్షన్ ఉందని చెబుతున్నారని ట్వీట్ చేశారు. చెరో వాదన వినిపిస్తుంటే ఎవరి మాటలు నమ్మాలి? అంటూ నిలదీశారు. ఎవరిని మభ్యపెట్టేందుకు ఇలాంటి ప్రకటనలు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nara Lokesh
Mekathoti Sucharitha
DGP
Andhra Pradesh
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News