Jagan: ఏపీ లోకాయుక్త చైర్మన్ గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి నియామకం
- లక్ష్మణ్ రెడ్డి పేరు ఖరారు చేసిన సీఎం జగన్!
- ఆమోద ముద్ర వేసిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి
- ఐదేళ్లపాటు పదవిలో కొనసాగనున్న జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి
తాజాగా ఏపీ లోకాయుక్తను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లోకాయుక్త చైర్మన్ గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ రెడ్డిని నియమించారు. ఇటీవలే ప్రభుత్వం లోకాయుక్త చట్టానికి సవరణలు తీసుకొచ్చింది. తాజా సవరణలను అనుసరించి లోకాయుక్త చైర్మన్ గా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తిని కాని, విశ్రాంత న్యాయమూర్తిని కానీ నియమించవచ్చు. ఈ క్రమంలో సీఎం జగన్ జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి పేరును ఖరారు చేయగా, రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఆమోదం తెలిపారు. లోకాయుక్త పదవిలో జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ఐదేళ్ల పాటు కొనసాగుతారు.