Varun Tej: విడుదలైన 'వాల్మీకి' ట్రైలర్ .. అదరగొట్టేసిన వరుణ్ తేజ్

  • తమిళ 'జిగర్తాండ'కి రీమేక్ గా 'వాల్మీకి'
  • ప్రధాన ఆకర్షణగా మిక్కీ జె. మేయర్ సంగీతం 
  • ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు

వరుణ్ తేజ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ 'వాల్మీకి' సినిమాను రూపొందించాడు. తమిళంలో హిట్ కొట్టిన 'జిగర్తాండ'కి ఇది రీమేక్. వరుణ్ తేజ్ కి నాయికగా పూజా హెగ్డే నటించగా, అధర్వమురళీకి జోడీగా మృణాళిని రవి కనిపించనుంది. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. 'నాపైన పందాలేస్తే గెలుస్తరు .. నాతోటి  పందాలేస్తే సస్తరు' .. 'మనం బతుకుతున్నమని పదిమందికి తెల్వకపోతే ఇక బతుకుడెందుకురా' అనే డైలాగ్స్ ఈ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచాయి. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచడంలో టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. రామ్ ఆచంట - గోపి ఆచంట నిర్మించిన ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని అందించాడు.

Varun Tej
Pooja Hegde
Adharva
Mrinalini
  • Error fetching data: Network response was not ok

More Telugu News