Amit Shah: జాతీయ పౌర జాబితా కేవలం అసోంకే పరిమితం కాదు: అమిత్ షా

  • చొరబాటుదారులను దేశం నుంచి వెళ్లగొడతాం
  • అక్రమంగా నివసిస్తున్నవారు ఎక్కడున్నా వదలబోం
  • చొరబాటుదారులెవరూ అసోంలో జీవించలేరు

చొరబాటుదారులను దేశం నుంచి వెళ్లగొడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. జాతీయ పౌర జాబితా పట్టిక కేవలం అసోం వరకే పరిమితం కాదని... దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారు ఎక్కడున్నా వదలబోమని చెప్పారు. గువహటిలో జరిగిన నార్త్ ఈస్ట్ డెమోక్రాటిక్ అలయెన్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చొరబాటుదారులెవరూ అసోంలో జీవించలేరని స్పష్టం చేశారు. అసలు దేశంలోని ఏ ప్రాంతంలో కూడా చొరబాటుదారులకు చోటు ఉండదని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతి ఇంటికి బీజేపీ చేరువకావాలని అన్నారు.

Amit Shah
NRC
Assam
BJP
  • Loading...

More Telugu News