Chandrababu: గుంటూరులో మేం శిబిరం పెట్టామని మీరు పిడుగురాళ్లలో కౌంటర్ శిబిరం పెడతారా?: వైసీపీ నేతలపై చంద్రబాబు ధ్వజం

  • ఐదేళ్ల నాటి బాధితులకు ఇప్పుడు శిబిరం పెట్టడం ఎక్కడైనా ఉందా?  
  • నలుగురూ నవ్విపోతారంటూ వ్యాఖ్యలు
  • నాకే సవాల్ విసురుతారా? అంటూ ఆగ్రహం

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ నేతలపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పల్నాడు వైసీపీ బాధితుల కోసం అంటూ టీడీపీ ఇటీవలే గుంటూరులో పునరావాస శిబిరం ఏర్పాటు చేసింది. దీనికి ప్రతిగా వైసీపీ పిడుగురాళ్లలో పోటీ శిబిరాన్ని ఏర్పాటు చేసిందంటూ చంద్రబాబు మండిపడ్డారు.

"గుంటూరులో మేం శిబిరం ఏర్పాటు చేశామని మీరు పిడుగురాళ్లలో కౌంటర్ శిబిరం ఏర్పాటు చేస్తారా? 5 ఏళ్ల క్రితం బాధితులకు ఇప్పుడు శిబిరం పెట్టడం ఎక్కడైనా ఉందా? నలుగురూ నవ్విపోతారు. అయినా ఈ విషయంలో నన్ను సవాల్ చేయడం ఏంటి? ఇది సవాళ్లు విసిరే సమయమా? లేక, బాధితులను ఆదుకునే సమయమా? అని అడుగుతున్నా" అంటూ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు.

Chandrababu
Telugudesam
YSRCP
Andhra Pradesh
Guntur
Piduguralla
  • Loading...

More Telugu News