ISRO: ఇస్రో చైర్మన్ శివన్ పేరిట ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్లు లేవు: ఇస్రో

  • సామాజిక మాధ్యమాల్లో శివన్ పేరిట పోస్టులు
  • అవన్నీ నకిలీ ఖాతాలేనన్న ఇస్రో
  • అధికారిక ఖాతాల వివరాలు వెల్లడి

చంద్రయాన్-2 ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ పేరు ఎక్కువగా చర్చకు వస్తోంది. ముఖ్యంగా, సోషల్ మీడియాలో ఆయన పేరిట అనేక పోస్టులు దర్శనమిస్తున్నాయి. అయితే, ఇస్రో చైర్మన్ డాక్టర్ కైలాసవడివూ శివన్ పేరిట సామాజిక మాధ్యమాల్లో అనేక ఖాతాలు క్రియాశీలకంగా ఉన్నట్టు గుర్తించామని, వాస్తవానికి ఆయనకు సోషల్ మీడియాలో ఎలాంటి వ్యక్తిగత ఖాతాలు లేవని ఇస్రో స్పష్టం చేసింది.

ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఓ సందేశం వెలువరించింది. అంతేగాకుండా, తమ సోషల్ మీడియా (ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్) ఖాతాల లింకులను కూడా ట్వీట్ లో పొందుపరిచింది.
The official account of ISRO on all social media platforms are as follows:

ISRO
Social Media
  • Error fetching data: Network response was not ok

More Telugu News