Nagarjuna Sagar: ప్రకాశం జిల్లా కరవు తీరేలా నీటి సరఫరా!

  • ప్రకాశం జిల్లాకు 2,250 క్యూసెక్కుల విడుదల
  • అన్ని మేజర్ కెనాల్స్ కూ నీటిని వదులుతున్న అధికారులు
  • నారుమళ్లు వేసుకునేందుకు రైతులు సిద్ధం

గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగునీరందించే నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా నిరాటంకంగా నీటి సరఫరా సాగుతుండగా, ఎగువ నుంచి వస్తున్న వరద నీరు పెరగడంతో, మరింత నీటిని అధికారులు వదులుతున్నారు. సాగర్‌ ప్రధాన కాలువ ద్వారా ప్రకాశం జిల్లా అవసరాలు తీర్చేందుకు 2,250 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతుండగా, కాలువ నిండుకుండలా ప్రవహిస్తోంది. కాలువ పరిధిలోని అన్ని మేజర్ కెనాల్స్ కు, చెరువులకు కూడా నీటిని పూర్తి స్థాయిలో విడుదల చేస్తున్నారు.

రైతులు నారుమళ్లు పోసుకునేందుకు అవసరమైన నీటిని మేజర్ కాలువలకు విడుదల చేయాలన్న రైతాంగం డిమాండ్ ను నెరవేర్చుతున్నామని అధికారులు అంటున్నారు. నిన్నమొన్నటి వరకూ వచ్చిన నీరు, చెరువులను నింపేందుకు సరిపోగా, ఇప్పుడు వస్తున్న నీటితో వరి వంటి నీటి ఆధారిత పంటలను వేసుకునేందుకు రైతులు సమాయత్తం అవుతున్నారు.

Nagarjuna Sagar
Right Cannal
Water
Flood
Prakasam District
  • Loading...

More Telugu News