Tollywood: ప్రభాస్-పూజాహెగ్డే జంటగా రొమాంటిక్ మూవీ.. యూరప్ లో షూటింగ్!

  • వివరాలను ప్రకటించిన హీరోయిన్ పూజాహెగ్డే
  • ఇది అద్భుతమైన స్క్రిప్ట్ అని ప్రశంస
  • ప్రభాస్ తో నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వ్యాఖ్య

హీరోయిన్ పూజాహెగ్డే తన తర్వాతి ప్రాజెక్టు వివరాలను సోషల్ మీడియాలో పంచుకుంది. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో తాను కొత్త సినిమాలో నటించబోతున్నట్లు పూజా హెగ్డే తెలిపింది. లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ను యూరప్ లో చేస్తారని చెప్పింది.

ఈ సినిమాకు సంబంధించిన స్ట్రిప్ట్ ను తాను చదివాననీ, ఇది అద్భుతమైన కథ అని వ్యాఖ్యానించింది.  ప్రభాస్ సరసన నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పూజా హెగ్డే ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News