Dhoni: ధోనీకి గౌరవప్రదంగా వీడ్కోలు పలకండి: అనిల్ కుంబ్లే
- గౌరవప్రదమైన వీడ్కోలుకు ధోనీ అర్హుడు
- రిటైర్మెంట్ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నా... ధోనీకి ఘనంగా వీడ్కోలు పలకాలి
- టీ20 ప్రపంచకప్ జట్టుపై సెలెక్టర్లు దృష్టి సారించాలి
ఇంగ్లండ్ లో జరిగిన ప్రపంచకప్ తర్వాత రెండు నెలల పాటు క్రికెట్ కు ధోనీ దూరమైన సంగతి తెలిసిందే. ఈ రెండు నెలల పాటు ఆయన సైన్యంతో కలసి ఉన్నాడు. మరోవైపు, వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ టోర్నీకి సంబంధించి, జట్టులో ధోనీకి స్థానం ఉంటుందా? లేదా? అనే విషయంపై సందిగ్ధత నెలకొంది.
ఈ నేపథ్యంలో, టీమిండియా మాజీ కెెప్టెన్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే మాట్లాడుతూ, గౌరవప్రదమైన వీడ్కోలుకు ధోనీ అన్ని విధాలా అర్హుడని చెప్పారు. రిటైర్మెంట్ తీసుకోవాలనే నిర్ణయానికి ధోనీ వచ్చినప్పుడు... ఆయనకు గౌరవంగా వీడ్కోలు పలకాలని సూచించారు. టీ20 ప్రపంచకప్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో, ఎలాంటి జట్టు ఉండాలనే విషయంలో సెలెక్టర్లు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించాలని చెప్పారు.