Jammu And Kashmir: జమ్మూకశ్మీర్‌లో మళ్లీ కర్ఫ్యూ

  • మొహర్రం సందర్భంగా అల్లర్లు చెలరేగే అవకాశం
  • భారీగా పోలీసుల మోహరింపు
  • ఊరేగింపులు నిషేధం

జమ్మూకశ్మీర్‌లో పలు ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. మొహర్రం సందర్భంగా అల్లర్లు చెలరేగే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ సహా పలు ప్రాంతాల్లో సాయుధ పోలీసులను భారీగా మోహరించారు. లాల్‌చౌక్‌లో కంచెవేసి ఎవరూ ఊరేగింపులు నిర్వహించకుండా సీలు వేశారు. అత్యవసర వైద్య సేవల కోసం మాత్రం కొందరిని మాత్రమే అనుమతిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కర్ఫ్యూ కారణంగా పలు నగరాల్లో విద్య, వ్యాపార సంస్థలు మూతబడ్డాయి.

Jammu And Kashmir
srinagar
curfew
  • Loading...

More Telugu News