narsipanam: పశువుల దాణా మాటున గంజాయి రవాణా.. 815 కేజీల గంజాయి స్వాధీనం
- నాణ్యమైన శీలావతి రకం గంజాయి అక్రమ రవాణా
- పట్టుకున్న గంజాయి విలువ రూ. 81.40 లక్షలు
- లారీకి దారిచూపిన వ్యక్తి కోసం గాలింపు
పశువుల దాణా మాటున పెద్ద ఎత్తున తరలిస్తున్న గంజాయిని విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన నారాయణ మహబూబ్‌ను అరెస్ట్ చేశారు. లారీ యజమాని కూడా అతడేనని పోలీసులు తెలిపారు. లారీలో పెసరపొట్టు, మినపపొట్టు, వరిపొట్టు బస్తాల దిగువన దాచిన గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దానిని పరిశీలించిన పోలీసులు నాణ్యమైన శీలావతి రకం గంజాయిగా గుర్తించారు. 815 కేజీల బరువున్న ఈ గంజాయి విలువ మార్కెట్లో రూ.81.40 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. లారీకి ముందు హెల్మెట్ పెట్టుకుని బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి లారీకి దారిచూపినట్టు పోలీసులు గుర్తించారు. అతడు నర్సీపట్నానికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్న పోలీసులు అతడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.