Kollywood: తమిళ సినీ నటుడు, దర్శకుడు రాజశేఖర్ మృతి!

  • అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిక
  • పరిస్థితి విషమించి మరణించిన రాజశేఖర్
  • సంతాపం తెలిపిన తమిళ పరిశ్రమ ప్రముఖులు

ప్రముఖ తమిళనటుడు, ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో క్యారెక్టర్ పాత్రలను పోషించిన రాజశేఖర్, అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. గత కొంతకాలంగా టీవీ సీరియల్స్ కు మాత్రమే పరిమితమైన ఆయన, చెన్నైలోని వలసరవాక్కంలో నివాసం ఉంటున్నారు.

ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు స్థానిక రామచంద్ర ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించగా, తుదిశ్వాస విడిచారు. రాజశేఖర్ మరణంగా కోలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. దర్శకుడిగా తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రాజశేఖర్, 'పలైవనచోలై' 'చిన్నపూవే మెల్ల పెసు' తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. నటుడిగా నిలళ్ గల్ (1980) చిత్రంతో తెరంగేట్రం చేశారు. ఆపై మరికొన్ని చిత్రాలనూ నిర్మించారు. 'శరవణన్ మీనాక్షి' సీరియల్‌ లో ఆయన నటన ప్రశంసలు అందుకుంది.

Kollywood
Rajasekhar
Passes Away
Died
Hospital
  • Loading...

More Telugu News