Chandrababu: ఎన్ని కేసులు పెడతారో పెట్టండి.. నేనూ చూస్తా: వైసీపీపై చంద్రబాబు ఫైర్

  • వైసీపీ దాడులపై చంద్రబాబు ఆగ్రహం
  • ప్రజాస్వామ్య పరిరక్షణకుఈ నెల 11న ‘చలో పల్నాడు’
  • నాయకులందరూ తరలి రావాలి

ఏపీలో వైసీపీ ఆటలు సాగనివ్వమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడం, కేసులు బనాయించడంపై ఆయన మండిపడ్డారు. వైసీపీ దాడుల బాధితులంతా ఈ నెల 10న గుంటూరులోని పునరావాస కేంద్రానికి రావాలని పిలుపు నిచ్చారు. పార్టీ నేతలతో ఈరోజు ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించారు. ‘ఎన్ని కేసులు పెడతారో పెట్టమనండి నేనూ చూస్తా.. ముందు నా మీద కేసు పెట్టమనండి చూద్దాం’ అంటూ సవాల్ విసిరారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు గాను ఈ నెల 11న ‘చలో పల్నాడు’ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ‘చలో పల్నాడు’కు నాయకులంతా తరలి రావాలని పిలుపు నిచ్చారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులపై బనాయించిన కేసులను ఎదుర్కోవడానికి తమ లీగల్ సెల్ అండగా ఉంటుందని చెప్పారు.

తమ నేతలపై బనాయించిన కేసులను హెచ్ ఆర్సీ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రైవేట్ కేసులు వేద్దామని, ఈ నెల 10న టీడీపీ లీగల్ సెల్ సమావేశం జరుగుతుందని చెప్పారు. తన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరూ హత్య చేశారో చెప్పలేని వ్యక్తి తమను భయపెట్టాలని, బెదిరించాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ పరోక్షంగా జగన్ ను హెచ్చరించారు. తమను బెదిరించి, భయపెట్టి రాజకీయం చేయడం వీళ్ల వల్ల కాదని అన్నారు.

  • Loading...

More Telugu News