Spice jet: విమానంలో వెళుతుండగా ఒక్కసారిగా పక్షవాతం.. ప్రాణాలు విడిచిన ‘స్పైస్ జెట్’ ప్రయాణికుడు!

  • చెన్నై-కోల్ కతా సర్వీసులో ఘటన
  • అస్వస్థలకు లోనైన ప్రయాణికుడు
  • భువనేశ్వర్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

విమానం గాల్లో ఉండగానే పక్షవాతం రావడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ప్రముఖ ఎయిర్ లైన్స్ కంపెనీ స్పైస్ జెట్ విమానంలో చోటుచేసుకుంది. స్పైస్ జెట్ కంపెనీకి చెందిన ఫ్లైట్ 623  సర్వీస్ ఈరోజు చెన్నై నుంచి కోల్ కతాకు బయలుదేరింది. అయితే విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు(48) అస్వస్థతకు లోనయ్యాడు.

ఊపిరి ఆడకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడిన సదరు వ్యక్తికి పక్షవాతం వచ్చినట్లు గుర్తించిన విమాన సిబ్బంది భువనేశ్వర్ ఎయిర్ పోర్టులో విమానాన్ని అత్యవసరంగా దింపేశారు. అనంతరం హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ సదరు ప్రయాణికుడు మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News