Amaravathi: అమరావతిని ఫ్రీజోన్ చేయాల్సిందే: టీజీ వెంకటేశ్ డిమాండ్

  • ఉమ్మడి ఏపీలో ఫ్రీజోన్ లేనందువల్ల రాయలసీమ నష్టపోయింది
  • ఇప్పుడు కూడా అదే తప్పు జరిగితే చూస్తూ ఊరుకోం
  • అమరావతిలో కొత్తగా ఏ ఒక్క నిర్మాణం చేపట్టొద్దు

ఏపీ రాజధాని అమరావతిని ఫ్రీజోన్ చేయాల్సిందేనని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉమ్మడి మద్రాసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఫ్రీజోన్ లేని కారణంగా రాయలసీమ ప్రాంతం చాలా నష్టపోయిందని అన్నారు. ఇప్పుడు కూడా అదే తప్పు జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వేల కోట్ల రూపాయలతో అమరావతిలో నిర్మించిన హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ చాలు అని, అక్కడ కొత్తగా ఒక్క నిర్మాణం చేపట్టినా వ్యతిరేకిస్తామని అన్నారు.

Amaravathi
Telugudesam
Tg venkatesh
Free Zone
  • Loading...

More Telugu News