Andhra Pradesh: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పరోక్ష విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి!

  • ఉద్ధానంలో 200 పడకల ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్ రాబోతోంది
  • దీంతో అద్దె విమానాల్లో ఎగిరిన వ్యక్తి కళ్లు మూసుకున్నాడు
  • ఈ వసతి జగన్ గారి ఉక్కు సంకల్పం నుంచి పుట్టుకొచ్చింది

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఏపీ ప్రభుత్వం ఉద్ధానంలో 200 పడకల ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభించిందని విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ఉద్ధానం చుట్టూ అద్దె విమానాల్లో ఎగిరిన వ్యక్తి ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చూడలేక కళ్లు మూసుకున్నాడని ఎద్దేవా చేశారు.

ఉద్ధానంలో త్వరలోనే 200 పడకల ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అందుబాటులోకి రాబోతోందని చెప్పారు. ఇలాంటి సౌకర్యం మెట్రో నగరాల్లో మాత్రమే ఉందనీ, చాలా రాష్ట్రాల రాజధానుల్లో లేదని కితాబిచ్చారు. ఇది ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారి ఉక్కు సంకల్పం నుంచి పుట్టుకొచ్చిందనీ, గాలి మాటలతో కాలేదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News