Andhra Pradesh: బడితపూజ జరిగితే మరింత సన్నగా తయారవుతావ్.. విజయసాయిరెడ్డికి బుద్ధా వెంకన్న వార్నింగ్!

  • నారా లోకేశ్ పై విజయసాయిరెడ్డి పరోక్ష విమర్శలు
  • సాయిరెడ్డి వ్యాఖ్యలను తిప్పికొట్టిన బుద్ధా వెంకన్న
  • 420 తాతయ్యకు చిన్నమెదడు చితికిందని ఎద్దేవా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన సన్నబియ్యం పథకంపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ నేత విజయసాయిరెడ్డి తీవ్రంగా మండిపడ్డ సంగతి తెలిసిందే. సన్నబియ్యం పథకం చూసి మాలోకం, ఆయన టీమ్ తట్టుకోలేకపోతోందని నారా లోకేశ్ ను పరోక్షంగా సాయిరెడ్డి విమర్శించారు. తాజాగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ప్రజల చేతిలో బడిత పూజ జరిగితే విజయసాయిరెడ్డి మరింత సన్నగా తయారవుతారనీ, అప్పుడు మాలోకం ఎవరో ఆయనకు అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు.

420 తాతయ్య విజయసాయిరెడ్డికి చిన్నమెదడు చితికిందని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. అందుకే ఉద్ధానం ప్రాంతాన్ని ఉద్ధరించింది జగనే అని నిసిగ్గుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘ఉద్దానం ప్రాంతంలో తుఫాను వచ్చి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కనీసం చూడటానికి కూడా రానివాడు ఉద్ధానాన్ని ఉద్ధరిస్తాడా? ఉద్ధానం బాధితుల కష్టాలు తెలుసుకుని కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారికి ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్లాంట్లు, ఫ్రీ డయాలసిస్, పెన్షన్లు, 200 పడకల ఆసుపత్రికి ప్రణాళిక కూడా చంద్రబాబు హయాంలో ప్రారంభమయిందే. టీడీపీ హాయాంలో ప్రారంభమైన సంక్షేమ పథకాలకు నువ్వు ఎప్పటికీ తండ్రివి కాలేవు. ఏదైనా కొత్తగా ట్రై చేయ్ సాయిరెడ్డీ’ అని బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో హితవు పలికారు.

Andhra Pradesh
Telugudesam
YSRCP
Budda venkanna
Vijay Sai Reddy
Warning
Twitter
  • Loading...

More Telugu News