India: దేశం గొప్ప న్యాయకోవిదుడ్ని కోల్పోయింది.. జెఠ్మలాని మరణంపై చంద్రబాబు ఆవేదన!

  • ఆయన న్యాయశాస్త్రాన్ని ఔపోసన పట్టారు
  • దేశానికి చిరస్మరణీయ సేవలు అందించారు
  • ఈరోజు ఉదయం కన్నుమూసిన జెఠ్మలాని

ప్రముఖ న్యాయ కోవిదుడు, కేంద్ర మాజీ మంత్రి రామ్ జెఠ్మలాని మరణంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రగాఢ సంతాపం తెలిపారు. జెఠ్మలాని మరణంతో దేశం గొప్ప న్యాయ కోవిదుడిని కోల్పోయిందని చంద్రబాబు తెలిపారు. న్యాయశాస్త్రాన్ని ఔపోసన పట్టిన గొప్ప రాజనీతిజ్ఞుడు రామ్ జెఠ్మలాని అని ప్రశంసించారు. న్యాయవాదిగా, పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా జెఠ్మలాని అందించిన సేవలు చిరస్మరణీయమని వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్ గా పేరుగాంచిన జెఠ్మలాని గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 7.45 గంటలకు ఆయన తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

India
Ram Jethmalani
Chandrababu
Telugudesam
Death
DEAD
Condolenses
  • Loading...

More Telugu News