Ram Jethmalani: రామ్ జెఠ్మలాని మరణంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి!

  • జెఠ్మలాని సేవలు చిరస్మరణీయం
  • ఆయన దేదీప్యమానంగా వెలిగే జ్యోతివంటి వారు
  • ప్రకటన విడుదల చేసిన ఏపీ సీఎంవో

ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలాని ఈరోజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో రామ్ జెఠ్మలాని మరణంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జెఠ్మలాని దేదీప్యమానంగా వెలిగే న్యాయ జ్యోతి వంటి వారని కితాబిచ్చారు.

జెఠ్మలాని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన జగన్, భగవంతుడు వారికి ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చిన ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లినప్పుడు జెఠ్మలానీయే ఆయన కేసును వాదించారు.

Ram Jethmalani
dead
Andhra Pradesh
Chief Minister
Jagan
Condolences
  • Loading...

More Telugu News