new governor: తమిళిసై వచ్చేశారు...విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన సీఎం కేసీఆర్‌, మంత్రులు

  • చెన్నై నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి
  • అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బేగంపేటకు
  • ఈరోజు 11 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం

తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితురాలైన తమిళిసై సౌందర్‌రాజన్‌ ఈరోజు ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నారు. చెన్నై నుంచి విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఆమె అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బేగంపేట విమానాశ్రయానికి వచ్చారు. అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన కేబినెట్‌ మంత్రులు, అధికారులు తమిళిసైకి ఘనంగా స్వాగతం పలికారు.

ఆ తర్వాత తమిళిసై రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఆమెచేత  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌ నూతన గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితోపాటు ఇతర మంత్రులు హాజరు కానున్నారు.

new governor
tamili sai
Hyderabad
begampeta
today sworn in
  • Loading...

More Telugu News